సినిమా రివ్యూ : గేమ్ ఓవర్
చిత్రం : గేమ్ ఓవర్

నటినటులు : తాప్సి,వినోదిని వైద్యనాదన్,సంచనా నట రాజన్ ,రమ్య సుబ్రహ్మణ్యన్,అనిష్ కురువిల్లా,టి.పార్వతి తదితరులు

సంగీతం : రాన్ ఏతాన్ యెహన్

ఛాయాగ్రహణం : రిచర్డ్ కెవిన్

ఎడిటింగ్ : వెంకట్ కచర్ల

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : అశ్విన్ శరవణన్

ఈ చిత్రం భారి అంచనాలు లేకపోయినా  ట్రైలర్ విడుదలయాకా హారర్ చిత్రాలను ఇష్టపడే అభిమానులో ఆసక్తి రేపింది.పలు సినిమాలలో ప్రేక్షకులను మెప్పించిన తాప్సి ఈ సినిమాలో కొత్తగా డిఫరెంట్ గా చేసిందన్న నమ్మకంతో థియేటర్లలోకి అడుగు పెట్టింది.మరి గేమ్ ఓవర్ కథ కథనాలు,నటినటులు ప్రేక్షకులను ఎ మాత్రం అలరించిందో చూద్దాం..

కథ ;

ప్రపంచంతో సంబందాలు తెంచుకొని హైదరాబాద్ శివార్లలో ఒక్క ఇంట్లో ఒంటరిగా ఉంటుంది స్వప్న (తాప్సి)కేవలం ఒక హెల్పర్ (వినోదిని)ఒక వాచ్ మెన్ సాయంతో స్వప్న బ్రతుకుతూ ఉంటుంది.ఆమె అలా ఉండాడానికి ఒక కారణం కుడా ఉంది.గత ఏడాది డిసెంబర్ 31 న జరిగిన కొన్ని సంఘటనల వలన ఆమె ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తుంది.రెండు క్షణాలైన చీకట్లో ఉండలెన్నంత బయం ఉంటుంది ఆమెకు.టాటూ వల్ల బయటికి కన్పించని హింసను అనుభవిస్తూ ఉంటుంది.అనుకోకుండా ఎవరికో వేయాలిసిన టాటూ స్వప్న చేతికి పడుతుంది.ఈ క్రమంలో నగరంలో అతి కిరాతకంగా హత్య చేయబడిన అమ్మాయిల ఉదంతాలు చదివింది.చివరకు స్వప్న అలాంటి పరిణామమే వచ్చి పడుతుంది.ఇది గేమ్ ఓవర్..

కథనం,విశ్లేషణ :
అశ్విన్ శరవణన్ సేఫ్ గేమ్ ఆడాడని అనిపిస్తుంది.సినిమా మొదట్లో క్రైం కథ అనే ఫీలింగ్ కలిగించి తర్వాత హారర్ ఎలిమెంట్స్ ని జొప్పించాడు.స్క్రీన్ ప్లే అల్లుకున్న విదానం బాగా ఉంది.కథ కొత్తగా డైరెక్టర్ రాసుకున్నారు.కొంత తడబాటు కారణంగా ఫస్ట్ ఆఫ్ సాగదిసినట్టు అన్పిస్తుంది.ఈ సినిమాలో కీలక బాగం అమృత చావుకు సంబందించినది.తాప్సి చేతి మిద ఉండే టాటూ ను లింక్ చేయడం అనే పాయింట్ తో సెకండ్ ఆఫ్ టెంపోను సామాన్య ప్రేక్షకుడుకి అర్ధమయ్యేలా క్లైమాక్స్ లో క్లారిటి ఇవ్వడం మిస్సైనట్టు ఉంటుంది. సినిమా నుంచి ప్రేక్షకుడి ద్రుష్టి మరల్చకుండా ఉత్కంటభరితంగా తెరకెక్కించాడు.ఒక్కో సిన్ రివిల్ ఆయె కొద్ది సినిమాను పర్ఫెక్ట్ గా సింక్ అయింది.సీరియల్ మర్డర్ ల గురించి వాటి వెనుక ఎవరు ఉన్నారో అనే ప్రశ్నలకు సమదానం దొరకదు.టాటూ లో అమృత ఆత్మ ఉన్నపుడు తాప్సి ని ఎందుకు హింస పెట్టిందో అర్ధం కాదు.గంట నలబై నిమిషాల లోపే ఉండడంతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

నటినటులు :

ఇది పూర్తిగా తాప్సి సినిమానే,హిరో లేడు,పాటలు లేవు సినిమా మొత్తాని తన మీదే వేసుకొని బాగా నటించింది.పర్ఫార్మన్స్ బెస్ట్ అని చెప్పోవచ్చు.హంతకులు ప్రాణాలు తీసివేస్తారని తెలిసినప్పుడు కుడా వచ్చే సిన్స్ లో బాగా నటించేసింది.టాటూ ఇబ్బంది పెడుతున్న సన్నివేశాల్లో అద్బుతంగా రాణించింది.పని మనిషిగా నటించిన వినోదిని కూడా బాగా నటించింది.చిన్న పాత్రలో ఎక్కవగా కన్పించే వినోదినికి ఇలాంటి పాత్ర దొరికింది.అనిష్ కురువిల్లా బాగానే గుర్తుండిపోతారు.సంచన  నటరాజన్ కూడా తనదైన స్టైల్ లో బాగానే చేసింది.

సాంకేతిక వర్గం :

థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వాళ్ళను సంతృప్తి చేయడంలో బాగానే సక్సెస్ అయ్యాడు అశ్విన్ శరవణన్.వసంత్ ఛాయాగ్రహణం గురించి చెప్పుకోవాలి.బ్యుటి పార్లర్,కాఫీ షాప్ తప్ప మిగతా సినిమా షుటింగ్ మొత్తం ఒకే ఇంట్లో నడుస్తున్నా కెమరామెన్ మిద చాల ఒత్తిడి ఉంటది.దాని వసంత్ బాగానే హ్యెండీల్ చేసారు.రాన్ ఏతాన్ యెహన్ సంగీత పరంగా ఆదరగోట్టేసాడు.రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ గురించి చెప్పడానికి ఎం లేదు.ఎందుకంటే సినిమా నిడివి తక్కువగా ఉంది కాబట్టి.వెంకట్ కచర్ల డైలాగ్స్ లో ప్రత్యేకత ఏమి లేదు.వైనాట్ రిలయన్స్ సంస్థ నిర్మాణం పరంగా రాజి లేకుండా నిర్మించింది.

చివరగా గేమ్ ఓవర్ సూపర్

రేటింగ్ :3/5

నోట్:- ఇది ఒక మనిషి యెక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.ఈ రివ్యూ ఆధారంగా ఒక్క అంచనాకు రావొద్దు.థియోటర్ కు వెళ్లి సినిమా చూడండి..
3 Comments on సినిమా రివ్యూ : గేమ్ ఓవర్

  1. I’m not sure why but this website is loading incredibly
    slow for me. Is anyone else having this problem or is it a issue on my end?

    I’ll check back later on and see if the problem still exists.

  2. Of course, what a fantastic site and instructive posts, I will bookmark your blog.All the Best!

  3. Normally I don’t read post on blogs, but I would like to say that this write-up very forced me to try and do it! Your writing style has been amazed me. Thanks, quite nice post.

Leave a comment

Your email address will not be published.


*