అమరావతి నిర్మాణం…ఎప్పటికి పూర్తయేను?

amaravthi




ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనా పరంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రతి పక్షాలు సక్సెస్ కాలేకపోయాయి. ఇక రాజాధాని  విషయంలో ఇప్పటి వరకు జగన్ ఎ ప్రకటన చేయకపోవడంతో విమర్శలు ఎద్రుకోవలసి వస్తుంది.

అమరావతి నిర్మాణంలో ఎలాంటి స్పష్టత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజాదానిని అక్కడే ఉంచుతారా? ..లేక ఇంకొక ప్రాంతానికి తరలిస్తారా?…అనే విషయం పై కూడా స్పష్టత లేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయిన కూడా రాజధాని విషయంలో జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒక్క ప్రకటన కూడా చేయాలేదు. ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదు..ఈ పరిస్థితి  ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియదు.




అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు సార్లు శంఖుస్థాపన కార్యక్రమాలు నిర్వహించింది. అందులో ఒక్కటి భూమి పూజా రెండు శంఖుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా చేసింది.. ఈ కార్యక్రమానికి దేశ ప్రదాని నరేంద్రమోడి, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు..దేశంలోని అన్ని నదులలోని జలాలను అమరావతిలో చల్లారు. ఇన్ని చేసిన అమరావతి నిర్మాణం జరగలేదు. శంఖుస్థాపన శిలాఫలకం చుట్టుపక్కల నిర్మానుష్యంగా మారింది..




Leave a comment

Your email address will not be published.


*