ఒక్క రోజు దీక్షకు 10కోట్లు ఖర్చా?..హైకోర్టు విస్మయం

chandrbabu-high court




ధర్మ పోరాట దీక్షకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్లు ఖర్చు పెట్టడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11న డిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన సంఘతి తెలిసిందే. ఈ దీక్షకు 10కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి సుర్యనారయణరాజు సవాల్ చేస్తూ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించింది.




పిటిషనర్ తరపు న్యాయావాది వాదనలు వినిపిస్తూ చంద్రబాబు నాయుడు డిల్లిలో  ఒక్క రోజు దిక్షకోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పగా ధర్మాసనం ఈ విషయంపై విస్మయం వ్యక్తం చేసింది. అ డబ్బంతా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందని గుర్తు చేసింది. ఇలా ప్రజా ధనాన్ని రాజకీయాల కోసం డబ్బులు విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని కోర్టు నిలదీసింది. అసలు ఎ చట్టం కింద…ఎ నిబందన కింద 10 కోట్ల రూపాయలు విడుదల చేసారని ప్రశ్నించింది..ఇందుకు బాద్యులు ఎవరని కూడా ప్రశ్నించింది.. ఎ అధికారంతో దీక్ష కోసం 10 కోట్ల రూపాయలు నిధులు   ఇచ్చారో వివరిస్తూ   పూర్తీ వివరాలను కౌంటర్ రూపంలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను   నవంబర్ 21కి వాయిదా వేసింది.




Leave a comment

Your email address will not be published.


*