ఐవిరెడ్డికి పార్టీలో జగన్ ప్రాదాన్యత ఇవ్వాలి… కార్యకర్తల్లో చర్చ…

jagan-ivreddy
ఇటివల జరిగిన ఎన్నికల్లో వైసిపి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే ఏకంగా 175 స్థానాలకు గాను 151 స్థానాలను కైవసం చేసుకొని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసారు.ఇది ఇలా ఉంటె వైసిపి తరపున పోటి చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులు బంపర్ మెజారిటితో గెలిచారు. అలా బంపర్ మేజారితో గెలిచినా వారిలో ప్రస్తుత ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో గెలవగా   రెండవ స్థానంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు  రెండవ స్థానంలో  గెలిచారు.

అయితే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు   అ రెండవా స్థానమే ఆయనకు ఉపిరి సలపనియ్యకుండా చేస్తోందని   గిద్దలూరు వైసిపి నాయకులో జరుగుతున్నా చర్చ… ఇక్కడ అన్నా ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వంత వర్గం ఒక్కటి, టిడిపి నుంచి వచ్చిన వర్గం ఒక్కటి, ఇక నిజమైన వైసిపి కార్యకర్తలు విరు ఐవి రెడ్డి వర్గంగా ఉన్నారు. అయితే ఇన్ని వర్గాలను సమన్వయం    చేసుకుంటూపోతున్నా   కూడా పనుల విషయంలో తన స్వంత వర్గానికి   పనులు కట్టబెడుతున్నారని   మిగతా వర్గాల నుంచి    వినిపిస్తుంది. ఇక్కడ ఐవిరెడ్డి వర్గం అంటే   వైసిపి నిజమైన కార్యకర్తలను అన్నా రాంబాబు దగ్గరికి కుడా   రానివ్వటం లేదని   ఎమన్నా    పనులు పడి వెళితే చిరాక్ పడుతున్నారని  తన స్వంత వర్గానికి కూడా ఐవిరెడ్డి వర్గాన్ని దూరం  పెట్టేలా ప్రోత్సహిస్తున్నారని కూడా వాపోతున్నారు. గత తొమ్మిది   సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన    ఒరిగింది   ఎం లేదని బాదపడుతున్నారు…
వైసిపి అధిష్టానం  ఐవి రెడ్డి కి టిక్కెట్ ఇవ్వకపోవడం ఇటు అన్నా రాంబాబు చర్యలు కూడా  కార్యకర్తలకు మింగుడు పడని విషయంగా మారింది.   గిద్దలూరు నియోజకవర్గం ప్రజల్లో కూడా ఐవి రెడ్డి పై సానుభూతి పెరిగిందని కూడా తెలుస్తోంది. ఐవిరెడ్డి ఆయింటే బాగుండే అన్న చర్చ.. గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరిని కదిపిన ఇదే విషయం చెబుతారు. ఐవి రెడ్డికి వైసిపి పార్టీ అధిష్టానం తగిన  ప్రాదాన్యత   కలిపిస్తే కార్యకర్తల్లో కూడా కొంత అండ   దొరుకుతుందని కూడా   చర్చ నడుస్తుంది…మున్ముందు  కూడా పార్టికి   అవసరం అనుకుంటే సేవ చేసుకోవాడానికి సిద్దంగా ఉంటాడని వైసిపి పార్టీ కార్యకర్తల్లో నుంచి వినిపిస్తున్నా  మాట..మరి వైసిపి అధిష్టానం ఐవి రెడ్డికి ఎటువంటి ప్రాదాన్యత కలిపిస్తుందో చూడాలి.. జగన్ ఎ నిర్ణయం తీసుకుంటాడో    చూడాలి… 

 
Leave a comment

Your email address will not be published.


*