రాజధానిపై మీ వైఖరి ఏంటి…ఎపికి రాజధాని అవసరం లేదా!

jagan-lokesh
ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి రాజాదానిపై తన వైఖరి ఏమిటో తెలియక వైసిపి నేతలు రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను అందోళనలకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజాధాని శంఖుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు పూర్తీ అయిన సందర్భంగా లోకేష్ ట్విట్ చేసారు. 

ఏదైనా ఉరిని దుష్ట శక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడి పోవడమో, ప్రజలు అన్ని ఎక్కడిక్కడ అన్ని వదిలేసి వెళ్లిపోవడమో ఇలాంటివి మనం కథల్లో వింటుంటాం. ఇప్పుడు అమరావతి విషయంలో ఇదే జరిగిందేమో అన్నట్లు ఉందని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం రాజాధాని నిర్మాణానికి  శంఖుస్థాపన జరిగింది. కాని ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణానికి ఏమైనా ప్రణాలికలు ఉన్నాయా? లేక రాజధానిని ఎక్కడికైనా మారుస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. మీరైతే రాజధాని ప్రాంతంలో రాజ భవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజదాని అవసరం లేదా? రాజదాని పై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండి అంటూ ప్రశ్నించారు.    
Leave a comment

Your email address will not be published.


*