పుట్టగొడుగులు తెచ్చిన తంటా వైసిపి కార్యకర్త హత్య
గ్రామాల్లో పార్టీల కార్యకర్తల మద్య చిన్న చిన్న తగాదాలకే ప్రాణాలు తీసుకునేంత స్థాయికి వెళ్ళుతున్నారు. పెద్ద పెద్ద గొడవలు లేకపోయినా తన్నుకుంటూన్నారు. టిడిపి, వైసిపి కార్యకర్తలు ఒకరిపై ఒక్కరు దాడులు చేసుకుంటున్నారు. హత్యాయత్నం, హత్యలు పరిపాటిగా మారిపోయింది తాజాగా శ్రీకాకుళం జిల్లాలో హత్య చోటు చేసుకున్నది.

జిల్లాలోని కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామంలో పుట్టగొడుగుల కోసం టిడిపి, వైసిపి మద్య జరిగిన ఘర్షణలో వైసిపి కార్యకర్త హత్యకు దారితీసింది. పుట్టగొడుగుల విషయంపై చిలికి చిలికి పెద్ద పెద్ద వివాదం అయింది. దాంతో టిడిపి, వైసిపి   వైరి వర్గాల అయినటువంటి కొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి వైసిపి కార్యకర్త అయినటువంటి   జంగం అనే వ్యక్తిని కడుపులో బల్లెంతో పొడిచాడు. దీంతో పాలకొండ ఆస్పత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది.
జంగం పై దాడికి పాల్పడినవారు పరారిలో ఉన్నారు. ఈ దాడిలో జంగంతో పాటు మరో ఐదుగురు గాయలుపాలు అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను చక్క దిద్దేపనిలో ఉన్నారు. 
Leave a comment

Your email address will not be published.


*