స్టిక్కర్ సియం : జనసేనాని విమర్శలు

pavan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎపి సియం జగన్మోహన్ రెడ్డి పై మరోసారి మండి పడడ్డాడు. గతంలో చంద్రబాబు చేసిన నిర్లక్ష్యం, అలసత్వం మీరు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులనే సియం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఎలాంటి మార్పు లేదని సోషల్ మీడియా ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కళ్యాణ్. వంద రోజుల పాలనలో ఎక్కవగా వైఫల్యాలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయంలో నిర్లక్ష్యంతో  బోటు ప్రమాదం జరిగితే…అదే నిర్లక్ష్యం,అదే అలసత్వంతో జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారని అన్నారు, ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వాలు నెల రోజుల తర్వాత బోటును బయటకు తీయడమే విజయంగా చెప్పుకుంటున్నారు.
పంచాయితీ ఆఫీసులు, స్కూల్స్, చివరకు స్మశానాలకు రంగులు వేస్తున్నారని..ప్రభుత్వం నడుపుతున్నా మద్యం షాపులకు కుడా రంగులు వేయాలిసిందన్నారు. ఇక రైతు పొలంలో పంటకి వెయ్యడమే మిగిలిందన్నారు. 
Leave a comment

Your email address will not be published.


*