ట్విట్టర్ లో కెసిఆర్ కు హెచ్చరిక… రేవంత్ కోసం పోలీసులు గాలింపు..

todayflying
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్టిసి సమ్మెకు మద్దతుగా ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బట్టి మల్లు విక్రమార్క, శ్రీధర్ బాబు,షబ్బీర్ అలీ వంటి ముఖ్య నేతలను పోలీసులు హౌస్  అరెస్టు చేసారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాడానికి వెళ్ళిన పోలీసులు అయన ఇంటి దగ్గరకు వెళ్ళారు, కాని అక్కడ రేవంత్ రెడ్డి లేరు, దీంతో పోలీసులు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించిన వెంటనే    అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారి చేసారు.
ఒక వైపు పోలీసులు రేవంత్ కోసం గాలింపు చేస్తుంటే…అయన అజ్ఞాతంలో ఉండి ట్విట్టర్ ద్వారా సియం కెసిఆర్ ను హెచ్చరించారు.”మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కెసిఆర్ ఖబడ్ధార్ ! అంజన్ యాదవ్ , రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.” అంటూ ట్వీట్ చేశారు.

 
Leave a comment

Your email address will not be published.


*