తెలంగాణ బిజెపిలోకి వలసలు
తెలంగాణ బిజెపిలోకి రోజు రోజుకు ఇతర పార్టీల నుంచి వలసల సాగుతున్నాయి.ఇటివల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపి సీట్లు గెలుపొందారు.అదే ఉత్సాహంతో తెలంగాణలో బిజెపి పార్టీని బలోపేతం చేసి 2024 అధికారం చేపట్టాలనే దిశగా అ పార్టీ పావులు కదుపుతుంది.ఈ క్రమంలో కాంగ్రెస్,టిడిపిల నుంచి  పలువురు నేతలు బిజెపిలో చేరారు. 
డిల్లిలోని బిజెపి కార్యాలయంలో టిడిపి నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి,బోడ జనార్ధన్ రెడ్డి ,మాజీ ఎంపి చాడ సురేష్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ళ శశిధర్ రెడ్డి,పిసిసి మైనారిటి నేత షేక్ రహమతుల్లా బిజెపిలో చేరారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 
1 Comment on తెలంగాణ బిజెపిలోకి వలసలు

  1. Very interesting subject, regards for putting up. “Education a debt due from present to future generations.” by George Peabody.

Leave a comment

Your email address will not be published.


*