రెండిటిలో ముందుగా వచ్చేది ఎదో?

pavan kalyan
దీపావళి సందర్భంగా రాంచరణ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ సిని రిఎంట్రీ పై స్పందించారు. బాబాయి కొన్ని కథలు వింటున్నాడని మంచి కథ దొరికితే నటిస్తాడని  స్పష్టం చేసాడు. అయితే పవన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ఒక్కటి క్రిష్ దర్శకత్వంలో వస్తుందని ఇది ఒక పిరియాడిక్ సినిమా అని తెలుస్తోంది. క్రిష్ ఈ పని మిదే బిజీగా ఉన్నాడట.. రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యాడు.
ఇక పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన రెండవ సినిమా పింక్ ఇది హిందీ, తమిళంలో మంచి హిట్ అయ్యింది. తెలుగులో చిన్న చిన్న మార్పులు చేస్తే హిట్ అవుతుందని నమ్మకం మిద ఉన్నాడట, అయితే ఈ సినిమా దర్శకత్వం వహించడానికి ఎవరిని అనుకోలేదని తెలుస్తోంది. ఇది రీమేక్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెబితే వారే దర్శకుడు … ఇకపై చూడాలి..పవన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. వీటిలో ఎ సినిమా ఒకే చేస్తాడో..ఏది ముందుగా పట్టాలపైకి ఎక్కుతుందో…. 
Leave a comment

Your email address will not be published.


*